అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల జమ ముహూర్తం ఖరారు – రైతులకు శుభవార్త! | Annadatha Sukhibhava 2nd Installment Date Check
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల విడుదల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నిధులతో కలిపి ఏటా రైతులకు రూ.20,000 అందించాలన్న హామీ మేరకు, ఆగస్టు 2న తొలి విడత చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు, రైతులకు దీపావళి కానుకగా రెండో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కసరత్తు మొదలుపెట్టాయి. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల నిధులు అక్టోబర్ 18న జమ చేయడానికి నిర్ణయించారు.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు కలిపి విడుదల
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాయం కింద రూ.2,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5,000 విడుదల చేయనుంది. మొదటి విడతలో ఇప్పటికే రైతులు రూ.7,000 అందుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో కూడా అదే తరహాలో రూ.7,000 అందుకోనున్నారు. ఇలా మూడు విడతల్లో మొత్తం రూ.20,000 సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ రెండో విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కౌలు రైతులకు ప్రత్యేక సాయం: రూ.20,000
పీఎం కిసాన్ పథకం కౌలు రైతులకు వర్తించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20,000 చెల్లించనుంది. దీనిలో భాగంగా, మొదటి విడతగా అక్టోబర్‌లోనే రూ.10,000 జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం కౌలు రైతులకి ఎంతో ఊరట కలిగించనుంది. ఇప్పటివరకు సుమారు 46.64 లక్షల మంది రైతు కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. భూ వివరాలను వెబ్‌ల్యాండ్ నుంచి సేకరించి, గ్రామ స్థాయిలో ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేశారు.
మీ పేరు జాబితాలో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
అర్హులైన రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో అన్నదాత సుఖీభవ అధికారిక పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. భూమిలేని కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు పొంది, ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుంటేనే లబ్ధి పొందగలరు. ఇంకా అర్హులైన రైతులు ఎవరైనా మిగిలి ఉంటే, వారు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసి సాయం పొందవచ్చని అధికారులు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే సంబంధిత గ్రామ రైతు సేవా కేంద్రంలో సంప్రదించి, మీ వివరాలను సరిచేసుకుంటే అన్నదాత సుఖీభవ నిధులు సులభంగా పొందవచ్చు. ఈ సారి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధుల జమ జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ సమాచారాన్ని మిగతా రైతులకు కూడా షేర్ చేసి వారికి సహాయం చేయగలరు.
Annadataha Sukhibhava Official Web Site